karti: ఆసక్తిని రేకెత్తిస్తోన్న 'దేవ్' టీజర్

  • రజత్ రవిశంకర్ దర్శకుడిగా 'దేవ్'
  • మరోసారి కార్తీ జోడిగా రకుల్ 
  • ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తోన్న కంటెంట్  

'ఖాకి' సినిమాతో తెలుగు .. తమిళ భాషల్లో సక్సెస్ ను అందుకున్న కార్తీ, మరోసారి రకుల్ తో కలిసి ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతున్నాడు. ఈ ఇద్దరి కాంబినేషన్లో రజత్ రవిశంకర్ 'దేవ్' సినిమా చేశాడు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి కొంతసేపటి క్రితం ఫస్టు టీజర్ ను రిలీజ్ చేశారు. లవ్ .. రొమాన్స్ .. యాక్షన్ .. ఛేజింగ్ సీన్స్ పై ఈ టీజర్ ను కట్ చేశారు.

కార్తీ వాయిస్ ఓవర్ తో ఈ టీజర్ మొదలవుతోంది. "ఈ లోకంలో బతకడానికి ఎన్నో దార్లున్నాయి .. ఎవరో చెప్పారని అర్థంగాని చదువు చదివి .. ఇష్టం లేని ఉద్యోగం చేసి .. ముక్కు మొహం తెలియని ఒక నలుగురు మెచ్చుకోవాలని కష్టపడి పడి పనిచేసి .. ఈగో .. ప్రెషర్ .. కాంపిటేషన్లో ఇరుక్కుని .. అంటీ అంటనట్టు లవ్ చేసి .. ఏం జరుగుతుందో అర్థం కాకుండా బతకడం ఒకదారి. ఇంకోదారి వుంది .." అంటూ తనకి నచ్చిన మార్గంలో కార్తీ దూసుకెళ్లడం ఈ టీజర్లో చూపించారు. సినిమాపై ఆసక్తిని పెంచేదిలా ఈ టీజర్ వుందని చెప్పొచ్చు. 

  • Error fetching data: Network response was not ok

More Telugu News