Jammu And Kashmir: కాశ్మీరులో పిడుగులతో కూడిన వర్షం... వందలాది పశువుల మృతి!

  • రాజౌరీ సమీపంలో భారీ వర్షం
  • అలాల్ మంగోటా ప్రాంతంలో పిడుగులు
  • నష్టాన్ని అంచనా వేస్తున్న అధికారులు

జమ్మూకాశ్మీర్ లోని రాజౌరీ సమీపంలో పిడుగుల వర్షం కురవగా, వందకు పైగా పశువులు మృత్యువాత పడ్డాయి. సుమారు 100కు పైగా మేకలు, గొర్రెలు, ఇతర జంతువులు మరణించాయని ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. ఘటన జరిగిన ప్రాంతానికి అధికారులు వెళ్లి, నష్టాన్ని అంచనా వేశారని తెలిపారు. అలాల్ మంగోటా ప్రాంతంలో భారీ వర్షంతో పాటు పిడుగులు పడ్డాయని, ఆ సమయంలో ఆరు బయట ఉన్న బకేర్ వాల్ కుటుంబాలకు చెందిన పశువులు మరణించాయని తెలిపారు.

Jammu And Kashmir
Lightning
Cattle
Died
Rajouri
  • Loading...

More Telugu News