Vijayawada: విజయవాడ కనకదుర్గమ్మకు 9న గాజుల అలంకరణ

  • భక్తుల నుంచి గాజులు సేకరించనున్న అధికారులు
  • ఇందుకోసం ఆలయం ఆవరణలో ప్రత్యేక కౌంటర్‌ ఏర్పాటు
  • దుర్గామల్లేశ్వర ఆలయం సన్నిధిలో సోమవారం మహాలక్ష్మి యాగం

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనక దుర్గమ్మకు ఈనెల 9వ తేదీన గాజుల అలంకరణ నిర్వహించనున్నారు. ఈ అలంకరణ కోసం భక్తుల నుంచి గాజులు సేకరించనున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు. ఆలయం ఆవరణలో ఇందుకోసం ప్రత్యేక కౌంటర్‌ ఏర్పాటు చేశారు.

భక్తులు సమర్పించిన గాజులతో అమ్మవారిని ఆ రోజున అలంకరించనున్నారు. కాగా, ఆలయం ఆవరణలో ఉన్న దుర్గామల్లేశ్వరస్వామి సన్నిధిలో సోమవారం అర్చకులు మహాలక్ష్మి యాగం నిర్వహించారు. యాగంలో ఉభయ దాతలు మొత్తం 75 మంది పాల్గొన్నారు. ధన త్రయోదశి సందర్భంగా నిర్వహించిన యాగంలో ఆలయ ఈవో కోటేశ్వరమ్మ కూడా పాల్గొన్నారు.

Vijayawada
kanakadurgamma
bangles puja
  • Loading...

More Telugu News