babar awam: విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టిన పాకిస్థాన్ బ్యాట్స్ మెన్!

  • టీ20ల్లో అత్యంత వేగంగా వెయ్యి పరుగులు చేసిన బాబార్
  • 26 ఇన్నింగ్స్ లలో ఈ ఘనతను సాధించిన పాక్ బ్యాట్స్ మెన్
  • 27 ఇన్నింగ్స్ లతో వెయ్యి పరుగులు చేసిన కోహ్లీ

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పేరిట ఉన్న రికార్డును పాకిస్థాన్ బ్యాట్స్ మెన్ బాబర్ ఆజం బద్దలుకొట్టాడు. అంతర్జాతీయ టీ20 మ్యాచుల్లో అత్యంత వేగంగా 1,000 పరుగులు సాధించిన రికార్డును కైవసం చేసుకున్నాడు. న్యూజిలాండ్ తో నిన్న జరిగిన చివరి టీ20 మ్యాచ్ లో ఓపెనర్ గా బరిలోకి దిగిన బాబర్ 58 బంతుల్లో 79 పరుగులు చేశాడు. 48 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అతను వెయ్యి పరుగుల మైలురాయిని అందుకున్నాడు. కేవలం 26 ఇన్నింగ్స్ లలోనే బాబర్ ఈ ఘనతను సాధించి... కోహ్లీని వెనక్కి నెట్టేశాడు. కోహ్లీ 27 ఇన్నింగ్స్ లలో 1,000 పరుగులు సాధించాడు. 

babar awam
t20
record
Virat Kohli
pakistan
india
  • Loading...

More Telugu News