KTR: అప్పటి వరకూ ఇంతే... డిసెంబర్ 11 వరకూ ఆగాల్సిందే!: ఉపాసనకు కేటీఆర్ సమాధానం

  • దివ్యాంగ బాలికలకు హాస్టల్ భవనం కావాలి
  • మంజూరు చేయించాలని కోరిన ఉపాసన
  • డిసెంబర్ 11 వరకూ ఆగాలన్న కేటీఆర్
  • తెలంగాణలో అమలులో ఉన్న ఎన్నికల కోడ్

ఇటీవల ఓ దివ్యాంగుల వసతి గృహానికి వెళ్లి, వారితో కాసేపు ఉండి, భోజనం పెట్టి, దుప్పట్లు పంచి వచ్చిన మెగా హీరో రామ్ చరణ్ భార్య ఉపాసన, అక్కడి పరిస్థితిని చెబుతూ కేటీఆర్ కు ఓ ట్వీట్ చేయగా, ప్రస్తుతానికి తానేమీ చేయలేనని ఆయన సమాధానం ఇచ్చారు.

"తెలంగాణ ప్రభుత్వం చక్కగా పనిచేస్తోంది. అయితే, మాకు మీ నుంచి మరింత ప్రేమ కావాలి. ఈ అమ్మాయిల కోసం ఏదైనా చేయండి. దయచేసి ఓ కొత్త హాస్టల్ భవనాన్ని మంజూరు చేయండి. నాకు చేతనైనంత సాయం నేను కూడా చేస్తాను" అని ఉపాసన, తన ట్విట్టర్ ఖాతాలో వ్యాఖ్యానిస్తూ, కేటీఆర్ ను ట్యాగ్ చేశారు.

దీనికి కేటీఆర్ సమాధానమిస్తూ, అమ్మాయిల కోసం పాఠశాల భవనం ఇప్పటికే మంజూరైందని చెప్పేందుకు సంతోషిస్తున్నానని అన్నారు. హాస్టల్ భవనం కోసం డిసెంబర్ 11 వరకూ వేచి చూడక తప్పదని అన్నారు. తమపై నమ్మకం ఉంచినందుకు కేటీఆర్ ధన్యవాదాలు చెప్పారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నందున, ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో కొత్తగా ఏ భవనాల మంజూరుకూ అవకాశం లేదన్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News