Telangana: ప్రణయ్-అమృతల ఇంటివద్ద తచ్చాడిన అపరిచిత వ్యక్తి.. పోలీసులకు ఫిర్యాదు!

  • పోలీసులను చూసి నిందితుడి పరారీ
  • నిందితులపై ఇప్పటికే పీడీ యాక్ట్ నమోదు
  • కేసు నమోదు చేసిన పోలీసులు

నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడలో కులాంతర వివాహం చేసుకున్న పెరుమాళ్ల ప్రణయ్ ను సొంత మామ మారుతీరావు చంపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రణయ్ తల్లిదండ్రులతో పాటు తన ప్రాణానికి సైతం ముప్పుందని అమృత పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఉన్నతాధికారులు వారి ఇంటి దగ్గర పోలీస్ భద్రతను ఏర్పాటు చేశారు. కాగా, తాజాగా పోలీసులు ఉన్నప్పటికీ ఓ దుండగుడు అమృత ఇంటి వద్ద తచ్చాడినట్లు తేలింది.

నిన్న సీసీటీవీ ఫుటేజీ ఫీడ్ ను పరిశీలించగా, శనివారం తెల్లవారుజామున ఓ వ్యక్తి అమృత ఉంటున్న ఇంటి ప్రాంగణంలో తచ్చాడినట్లు గుర్తించారు. ముసుగు ధరించి అక్కడే తిరిగిన నిందితుడు పోలీసుల పెట్రోలింగ్ వ్యాన్ చూసి పరారయ్యాడని వెల్లడించారు. ఈ విషయమై ప్రణయ్ తండ్రి బాలస్వామి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రణయ్‌ హత్య కేసులో ప్రధాన నిందితులైన తిరునగరు మారుతీరావు, ఎంఏ కరీం, శ్రావణ్‌కుమార్‌పై పోలీసులు ఇటీవల పీడీ యాక్ట్‌ను ప్రయోగించారు.

Telangana
Nalgonda District
miryala guda
honour killing
pranay
amruta
Police
unknown person
case
pd act
suspect
  • Loading...

More Telugu News