kollywood: ఇప్పటికి పేరు చెప్పలేను... ఆ హీరోను మాత్రం వదిలిపెట్టను: హీరోయిన్ అమైరా దస్తర్

  • వేధింపుల గురించి మరిన్ని వివరాలు చెప్పిన అమైరా
  • షూటింగ్ సమయంలో నరకం చూపించారు
  • ఏదో ఒకరోజు అతని పేరు చెబుతానంటున్న అమైరా

దక్షిణాదిన ఓ ప్రముఖ హీరో అల్లుడు, యువ హీరో తనను వేధించాడని సంచలన ఆరోపణలు చేసిన నటి అమైరా దస్తర్, తాజాగా ఓ పత్రికకను ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను ఎదుర్కొన్న వేధింపుల గురించి మరిన్ని వివరాలు చెప్పుకొచ్చింది. ఆ సినిమా షూటింగ్ సమయంలో హీరోతో సాంగ్ చేస్తుండగా, అనవసరంగా తనపై చెయ్యి వేసి ఇబ్బంది పెట్టాడని, ఆ విషయాన్ని దర్శకుడి దృష్టికి తీసుకెళితే, తనకు నరకం చూపించారని ఆరోపించింది.

ఉదయం ఎనిమిది గంటలకే షూటింగ్ కు పిలిచేవారని, తాను సిద్ధమై కార్వాన్  లో కూర్చుంటే ఎప్పటికీ పిలిచేవారు కాదని చెప్పింది. ఉదయం నుంచి కూర్చోబెట్టి సాయంత్రం ఓ ఐదు నిమిషాలు షూటింగ్‌ చేసి పేకప్ చెప్పేవారని, షూటింగ్ లేకుంటే తనకు విషయం చెప్పేవారు కాదని వెల్లడించింది. ఈ అనుభవంతో దక్షిణాది సినిమాలు చేయాలంటేనే భయం పట్టుకుందని చెప్పింది.

అయితే, ఈ విషయాలేవీ తన తల్లిదండ్రులకు చెప్పలేదని, ఆ హీరోకు దక్షిణాది సినీ పరిశ్రమలో మంచి పలుకుబడి ఉందని, ఓ పెద్ద హీరోకి అల్లుడని చెప్పింది. అతని పేరును ఇప్పుడు తాను చెప్పలేనని, చెబితే తన కెరీర్‌ ని నాశనం చేస్తారని వాపోయింది. అయితే, ఏదో ఒకరోజు అతగాడి పేరు చెబుతానని, ఆ హీరోని మాత్రం వదలేది లేదని అంది.

కాగా, అమైరా దస్తర్, గతంలో ధనుష్ తో కలసి 'అనేగన్' అనే సినిమాలో (తెలుగులో అనేకుడు) నటించింది. ఆమె, చెబుతున్న వివరాలను బట్టి ధనుష్ పైనే ఆరోపణలు చేస్తోందని సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఆ సినిమా సమయంలోనే వేధింపులను ఎదుర్కొని ఉంటుందని పలువురు అంటున్నారు. హీరో ధనుష్, రజనీకాంత్ అల్లుడన్న సంగతి తెలిసిందే. ఇక తనను వేధించింది ఎవరన్న విషయాన్ని అమైరా స్వయంగా చెబితే తప్ప నిజం బయటకు రాదు.

kollywood
South
Amaira Dastar
Harrasment
MeToo India
  • Loading...

More Telugu News