ఏ నటుడికీ దక్కని అదృష్టం.. విజయ్‌కు ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చిన అభిమానులు
- ఈనెల 6న విడుదల కాబోతున్న సర్కార్
- విజయ్ కోసం 175 అడుగుల భారీ కటౌట్
- తొలిసారి ముఖ్యమంత్రి పాత్రలో విజయ్
కొల్లం నన్బన్ ఫ్యాన్ క్లబ్ సభ్యులు విజయ్ కోసం 175 అడుగుల భారీ కటౌట్‌ను రూపొందించి శనివారం మలయాళ నటుడు సన్నీ వెయిన్ చేత ఆవిష్కరింపజేశారు. అంతేకాదు, విజయ్ పేరిట సేవా కార్యక్రమాలు చేసేందుకు రూ.లక్ష విరాళంగా సేకరించారు. ఇక తొలిసారి విజయ్ ముఖ్యమంత్రి పాత్రలో నటించిన సర్కార్ చిత్రంలో కీర్తి సురేశ్, వరలక్ష్మి శరత్ కుమార్ హీరోయిన్లుగా నటించారు.