Jagan: రెడ్లకు జగన్ శనిలా దాపురించాడు: జేసీ సంచలన వ్యాఖ్యలు

  • చిన్న గాయమైతే అన్ని డ్రామాలు అవసరమా?
  • శ్రీకాకుళం జిల్లా వైపు కన్నెత్తి కూడా చూడలేదు
  •  పట్టిసీమను వద్దన్న మూర్ఖుడు

ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్‌పై టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రెడ్లకు జగన్ శనిలా దాపురించాడని మండిపడ్డారు. నేడు మీడియాతో జేసీ మాట్లాడుతూ.. కోడికత్తితో చిన్న గాయమైతే దానికిన్ని డ్రామాలు అవసరమా? అని ప్రశ్నించారు.

శ్రీకాకుళం జిల్లా తిత్లీ తుపాను కారణంగా తీవ్ర నష్టాల పాలైతే జగన్ అటువైపు కన్నెత్తి కూడా చూడలేదని విమర్శించారు. జగన్‌కు కామన్‌సెన్స్ అనేదే లేదన్న జేసీ.. పట్టిసీమను వద్దన్న మూర్ఖుడు అని విమర్శించారు.చంద్రబాబు సీఎం అయితేనే అనంతపురం జిల్లాకు నీళ్లొస్తాయన్న జేసీ.. ఆయన్ను పట్టుదల, విజన్ ఉన్న నాయకుడిగా అభివర్ణించారు.

Jagan
JC Diwakar Reddy
Srikakulam District
Chandrababu
  • Loading...

More Telugu News