Telangana: శేరిలింగంపల్లిలో వెనిగళ్ల ఆనంద్ ప్రసాద్ ప్రచారం.. చెప్పులతో కొట్టుకున్న టీడీపీ నేతలు!

  • వెనిగళ్ల, మొవ్వా అనుచరుల మధ్య ఘర్షణ
  • పరస్పరం దాడిచేసుకున్న ఇరువర్గాలు
  • ఇరువురిని సముదాయిస్తున్న పోలీసులు

హైదరాబాద్, శేరిలింగంపల్లి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి వెనిగళ్ల ఆనంద్ ప్రసాద్ ఈ రోజు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వెనిగళ్ల, మరో నేత మొవ్వా సత్యనారాయణ అనుచరులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో వెనిగళ్ల ఆనంద్ ప్రసాద్ ప్రచారాన్ని మొవ్వా అనుచరులు అడ్డుకున్నారు.

అనంతరం టీడీపీ నేతపై చెప్పులతో దాడికి దిగారు. ఇరువర్గాలు రెచ్చిపోవడంతో భారీగా ఇక్కడకు చేరుకున్న పోలీసులు వెనిగళ్ల, మొవ్వా అనుచరులను సముదాయిస్తున్నారు. కాగా, ఇరువర్గాలు ఘర్షణకు దిగడంతో శేరిలింగంపల్లిలో భారీగా ట్రాఫిక్ స్తంభించింది.

Telangana
serlimgampally
elections
campign
Telugudesam
leaders
Telugudesam
attacked
chappals
sandals
police
  • Loading...

More Telugu News