Akhilapriya: అందరి లెక్కలూ సెట్ చేస్తా: భూమా అఖిలప్రియ

  • లెక్కలన్నీ సిద్ధంగా ఉన్నాయి
  • సరిచేసే వరకూ నిద్రపోను
  • కొత్తపల్లిలో భూమా అఖిలప్రియ

భూమా నాగిరెడ్డి బతికున్న సమయంలో ఎవరెవరు ఎన్నెన్ని ఇబ్బందులు పెట్టారో అందరి లెక్కలనూ తాను వేసుకున్నానని, అన్ని లెక్కలనూ సరిచూసే వరకూ నిద్రపోనని ఏపీ మంత్రి భూమా అఖిలప్రియ హెచ్చరించారు. నంద్యాల సమీపంలోని కొత్తపల్లిలో పర్యటించిన అఖిలప్రియ, ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ, తన ప్రత్యర్థులకు హెచ్చరికలు జారీ చేశారు.

అభివృద్ధి అడ్డుకునే వారి తాటతీస్తానని వ్యాఖ్యానించిన ఆమె, తనను ప్రజలకు దూరం చేసేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. గతంలో భూమాకు దగ్గరగా ఉన్న వారిలో కొందరు ఆయన్ను ఇబ్బందులు పెట్టారని, వారే నేడు తనను కూడా ఇబ్బందులు పెడుతున్నారని, వారి వెనుక కొన్ని రాజకీయ శక్తులున్నాయని అన్నారు. తాను ఎవరినీ వదిలిపెట్టబోనని హెచ్చరించారు. భూమా అఖిలప్రియ వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.

Akhilapriya
Bhuma Nagireddy
Politics
Nandyal
  • Loading...

More Telugu News