CPI: తెలంగాణ సీపీఐ రాష్ట్ర కమిటీ అత్యవసర భేటీ నేడు.. మహా కూటమి అంశంపై కీలక ప్రకటన?

  • సీట్ల కేటాయింపుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న నాయకత్వం
  • సమావేశం అనంతరం కొనసాగాలా? వద్దా? అనే అంశంపై నిర్ణయం
  • హాజరుకానున్న జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం

మహాకూటమిలో భాగస్వామిగా సీట్ల కేటాయింపు విషయంలో తీవ్ర అసంతృప్తితో ఉన్న సీపీఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆదివారం అత్యవసరంగా భేటీకానుంది. సీట్ల సర్దుబాటులో భాగంగా తమకు కేటాయిస్తున్న స్థానాలపై నాయకులు, కార్యవర్గం తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం.

అందువల్ల సమావేశం అనంతరం ప్రధానంగా మహాకూటమిలో కొనసాగాలా? వద్దా? అనే అంశంపై కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ సమావేశానికి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి హాజరుకానుండడంతో ప్రత్యేకత సంతరించుకుంది.

CPI
state committee meeting
mahakutami
  • Loading...

More Telugu News