Uttar Pradesh: ఐసీయూలో చికిత్స పొందుతున్న బాలికపై స్నేహితులతో కలిసి ఉద్యోగి గ్యాంగ్ రేప్!

  • ఉత్తరప్రదేశ్ లోని బరేలీలో ఘటన
  • పాముకాటుకు గురైన చిన్నారి
  • బరేలీలోని ప్రైవేటు ఆసుపత్రిలో ఘటన

ప్రాణాపాయంతో ఆసుపత్రిలో చేరిన చిన్నారి బాలికను కామాంధులు చిదిమేశారు. ఐసీయూలో చికిత్స పొందుతుందన్న కనికరం కూడా లేకుండా ఆమెపై గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. చివరికి బాధితురాలు ఈ విషయాన్ని తల్లికి వివరించడంతో దారుణం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని బరేలీ జిల్లాలో చోటుచేసుకుంది.

జిల్లాలోని ఓ గ్రామంలో బాలిక(8) పాముకాటుకు గురైంది. దీంతో తల్లిదండ్రులు ఆమెను జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయూలో ఉంచారు. ఈ నేపథ్యంలో ఆసుపత్రిలో పనిచేస్తున్న ఓ వ్యక్తి, మరో నలుగురు స్నేహితులతో కలిసి బాలికపై గ్యాంగ్ రేప్ చేశాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించి వెళ్లిపోయారు.

మరుసటి రోజు బాలికను వైద్యులు జనరల్ వార్డుకు తరలించారు. ఈ సందర్భంగా తనపై జరిగిన దారుణాన్ని బాధితురాలు తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఐదుగురు నిందితులపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారనీ, వారిని త్వరలోనే పట్టుకుంటామని పోలీస్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

Uttar Pradesh
barelly
gang rape
friends
snake bite
hospital staff
warned
Police
ran
  • Loading...

More Telugu News