Deewali: అతి తక్కువ ధరకు నాణ్యమైన టపాకాయలు: హాకా

  • ఎన్టీఆర్ గార్డెన్స్ లో ఏర్పాటు
  • మొత్తం 10 స్టాల్స్ ఏర్పాటు
  • వెల్లడించిన హాకా బిజినెస్ మేనేజర్ సీహెచ్ కృష్ణవేణి

దీపావళి సందర్భంగా హైదరాబాద్ నగర పరిధిలోని ప్రజలకు తక్కువ ధరలకు నాణ్యమైన టపాసులను అందించనున్నట్టు హాకా బిజినెస్ మేనేజర్ సీహెచ్ కృష్ణవేణి వెల్లడించారు. మీడియాతో మాట్లాడిన ఆమె, గడచిన 31 సంవత్సరాలుగా ప్రజలకు టపాకాయలను విక్రయిస్తున్నామని, ఈ సంవత్సరం కూడా పది స్టాల్స్ ఏర్పాటు చేశామని తెలిపారు.

ఇందిరాపార్కు ఎదురుగా ఉన్న ఎన్టీఆర్ స్టేడియంలో ఈ స్టాల్స్ ఉంటాయని, రోజూ ఉదయం నుంచి రాత్రి వరకూ ఇవి తెరచివుంటాయని, 7వ తేదీ వరకూ టపాసులను ప్రజలు కొనుక్కోవచ్చని అన్నారు. లాభాపేక్ష లేకుండా వీటిని విక్రయిస్తున్నామని అన్నారు.

Deewali
Stalls
Haka
NTR Gardens
  • Loading...

More Telugu News