Gsat-29: చురుగ్గా జీఎస్‌ఎల్‌వీ-మార్క్‌3డి2 రాకెట్‌ అనుసంధాన కార్యక్రమం.. ఈనెల 14న నింగిలోకి!

  • జిశాట్‌-29 సమాచార ఉపగ్రహాన్ని మోసుకెళ్లనున్న వాహక నౌక
  • శాటిలైట్‌ బరువు 3600 కిలోలు
  • గత ఏడాది ప్రయోగించిన జిశాట్‌-19తోపాటు అదనపు ప్రయోజనం

పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీష్‌ ధవన్‌ అంతరిక్ష కేంద్రం షార్‌లో జీఎస్‌ఎల్‌వీ-మార్క్‌3డి2 వాహకనౌక అనుసంధాన కార్యక్రమాలు చురుకుగా సాగుతున్నాయి. ఈనెల 14వ తేదీ సాయంత్రం 5.08 గంటలకు ఈ రాకెట్‌ నింగిలోకి దూసుకుపోనున్నది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లలో షార్‌ శాస్త్రవేత్తలు మునిగివున్నారు.

3600 కిలోల బరువున్న జిశాట్‌-29 సమాచార ఉపగ్రహాన్ని ఈ రాకెట్‌ కక్ష్యలోకి మోసుకు వెళ్లనున్నది. దేశంలో సమాచార సాంకేతిక వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు ఇస్రో గత ఏడాది జిశాట్‌-19 ఉపగ్రహాన్ని నింగిలోకి పంపించింది. తాజాగా ప్రయోగించనున్న జిశాట్‌-29తో మరింత అదనపు ప్రయోజనం సమకూరనుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News