Rahul Gandhi: ఎన్టీఆర్ కు పొడిచిన వెన్నుపోటే... రేపు రాహుల్ కు కూడా పొడుస్తారు!: చంద్రబాబుపై అసదుద్దీన్ సెటైర్

  • రేపు రాహుల్ గాంధీకీ అదే గతి
  • ఈ దోస్తీని ప్రజలు నమ్మరు
  • కూటమితో కలిసే ప్రసక్తే లేదన్న అసదుద్దీన్

ఎన్టీ రామారావుకు వెన్ను పోటు పొడిచి అధికారాన్ని చేజిక్కించుకున్న చంద్రబాబు, రేపు భవిష్యత్తులో రాహుల్ గాంధీకి అదే తరహాలో వెన్ను పోటు పొడుస్తారని మజ్లిస్ నేత అసదుద్దీన్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ తో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకోవడాన్ని ప్రస్తావించిన ఆయన, ఈ దోస్తీని ప్రజలు నమ్మబోరని అన్నారు.

తాను అధికారంలో ఉండేందుకు చంద్రబాబు ఏమైనా చేస్తారని, అది ఆయన గుణమని చెప్పిన అసదుద్దీన్, నాడు ఎన్టీఆర్ కు ఏ గతి పట్టిందో నేడు రాహుల్ కు అదే గతి పట్టనుందని జోస్యం చెప్పారు. చంద్రబాబుతో కలిసుండే పార్టీలతో, కూటమితో తాము సంబంధాలు కలుపుకునే ప్రశ్నే లేదని తేల్చి చెప్పారు.

Rahul Gandhi
Asaduddin Owaisi
Congress
BJP
AIMIM
  • Loading...

More Telugu News