GVL Narasimha Rao: అన్ని సంస్థలనూ అమరావతిలోనే ఏర్పాటు చేస్తూ సీఎం మళ్లీ తప్పు చేస్తున్నారు!: జీవీఎల్

  • బీజేపీ, న్యాయవాదులు చేస్తున్న దీక్షకు జీవీఎల్ మద్దతు
  • రాష్ట్ర హైకోర్టును రాయలసీమలోనే ఏర్పాటు చేయాలి
  • అన్ని సంస్థలూ అమరావతిలోనే ఏర్పాటు చేస్తున్నారు

గతంలో అన్ని సంస్థలనూ హైదరాబాద్‌లోనే ఏర్పాటు చేయడంతో రాష్ట్ర విభజన సమయంలో తామెంతో నష్టపోయామని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలంటూ తిరుపతిలో బీజేపీ, న్యాయవాదులు చేస్తున్న దీక్షకు జీవీఎల్ మద్దతు తెలిపారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సీఎంగా ఉన్నప్పుడు చేసిన తప్పునే చంద్రబాబు మళ్లీ చేస్తున్నారని విమర్శించారు. ప్రస్తుతం ఎదుర్కొంటున్న అనుభవాలను దృష్టిలో పెట్టుకోకుండా చంద్రబాబు అన్ని సంస్థలనూ అమరావతిలోనే ఏర్పాటు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర హైకోర్టును రాయలసీమలోనే ఏర్పాటు చేయాలని జీవీఎల్ డిమాండ్ చేశారు

GVL Narasimha Rao
Chandrababu
Amaravathi
Rayalaseema
Tirupati
  • Loading...

More Telugu News