Keerthi Sreenu: త్రాచుపామును కాల్చుకుని తిని అధికారుల తీరుకు నిరసన!

  • అధికారుల తీరుతో విసిగిపోయాడు
  • బ్యాంకు నుంచి రుణం కూడా అందలేదు
  • మూడు చోట్ల భూములు.. పనులన్నీ పెండింగ్‌

అధికారుల తీరుతో విసిగిపోయిన ఓ రైతు.. త్రాచుపామును కాల్చుకుని తిని నిరసన తెలిపిన ఘటన కలకలం రేపుతోంది.. పెద్దపల్లి జిల్లా మద్దిగుంటలో కీర్తి శ్రీను అనే రైతు చంద్రపల్లి గ్రామ శివారులో భూమి కొన్నాడు. రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు కానీ పట్టా పాసుపుస్తకాలు మాత్రం అతడికి అందలేదు. మరోచోట కొన్న భూమికి కూడా పట్టాకోసం దరఖాస్తు చేసుకున్నాడు. అది కూడా పెండింగ్‌లోనే ఉంది.

ఇంకో చోట భూమి కొన్నాడు. దానికి పాసు పుస్తకాలున్నా ఆన్‌లైన్‌లో నమోదు కాలేదు. దీంతో అతనికి బ్యాంకు నుంచి రుణం కూడా రాలేదు. విసిగిపోయిన శ్రీను తన పొలం వద్ద కనిపించిన త్రాచుపామును చంపి దాన్ని కాల్చి తిని అధికారుల తీరుకు నిరసన తెలిపాడు.

Keerthi Sreenu
Peddapalli District
Maddigunta
Snake
  • Loading...

More Telugu News