vijay: నా అభిమాన హీరో ప్రభాస్: వరలక్ష్మీ శరత్ కుమార్

  • విభిన్నమైన పాత్రలకే ప్రాధాన్యత 
  • చారిత్రక చిత్రంలో చేయాలనుంది 
  • యుద్ధం నేపథ్యంగా సాగే కథకి ఓకే    

తమిళ .. మలయాళ .. కన్నడ సినిమాల్లో కథానాయికగా వరలక్ష్మీ శరత్ కుమార్ మంచి గుర్తింపు తెచ్చుకుంది. 'పందెం కోడి 2' సినిమాలో ఆమె పాత్రకి మంచి మార్కులు పడ్డాయి. ఇక ఆమె తాజా చిత్రంగా 'సర్కార్' ఈ నెల 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతోంది. తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన విషయాలను గురించి ప్రస్తావించింది.

"ఇంతవరకూ నేను విభిన్నమైన కథలను .. పాత్రలనే ఎంచుకుంటూ వస్తున్నాను. కొన్ని పాత్రలు నాకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. చారిత్రక నేపథ్యం కలిగిన సినిమాలో ఒక మంచి రోల్ చేయాలనేది నా ఆశ. లేదంటే యుద్ధం నేపథ్యంలో సాగే కథలో అవకాశం లభించినా అదృష్టంగానే భావిస్తాను. నా అభిమాన హీరో ఎవరంటే మాత్రం ప్రభాస్ పేరు చెబుతాను . 'బాహుబలి' చూసిన దగ్గర నుంచి నేను ఆయన అభిమానిగా మారిపోయాను" అని చెప్పుకొచ్చింది.   

vijay
varalakshmi prabhas
  • Loading...

More Telugu News