tej pratap yadav: నేను విడాకులు కోరుకోవడానికి కారణం ఇదే: లాలూ కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్

  • ఐశ్వర్యతో సంతోషంగా ఉండలేకపోయా
  • సంతోషం లేనప్పుడు కలసి బతకడంలో అర్థం లేదు
  • విడాకుల కోసం కోర్టులో పోరాటం సాగిస్తా

ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ వివాహం మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. తన భార్య ఐశ్వర్యతో విడాకులు ఇప్పించాలంటూ ఆయన కోర్టులో పిటిషన్ వేశారు. ఈ సందర్భంగా తేజ్ ప్రతాప్ మాట్లాడుతూ, వివాహానంతరం ఐశ్వర్యతో తాను సంతోషంగా ఉండలేకపోయానని చెప్పారు. సంతోషంగా లేకుండా కలసి బతకడంలో అర్థం లేదని అన్నారు. ఈ నేపథ్యంలోనే తాను విడాకులకు దరఖాస్తు చేసుకున్నానని... కోర్టులో పోరాటం సాగిస్తానని చెప్పారు.

ఈ ఏడాది మే 12న తేజ్ ప్రతాప్, ఐశ్వర్యల వివాహం పాట్నాలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సహా 10వేల మందికి పైగా అతిథులు హాజరయ్యారు. ఈ సందర్భంగా తేజ్ ప్రతాప్ తరపు న్యాయవాది మాట్లాడుతూ, కలసి మనుగడ సాగించలేమనే అభిప్రాయానికి కొత్త జంట వచ్చారని చెప్పారు. 1955 హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 13(1), (1ఏ) కింద పిటిషన్ వేశామని తెలిపారు.

tej pratap yadav
wife
aishwarya
dovorce
reason
  • Loading...

More Telugu News