sabarimala: శబరిమలలో మళ్లీ ఉద్రిక్త వాతావరణం.. 5 వేల మంది పోలీసుల మోహరింపు

  • 5వ తేదీ సాయంత్రం తెరుచుకోనున్న శబరిమల
  • ఈరోజు నుంచే 144 సెక్షన్ అమలు
  • విధుల్లో ఇద్దరు ఐజీలు, ఐదుగురు ఎస్పీలు, 10 మంది డీఎస్పీలు

ఈ నెల 5వ తేదీన శబరిమల ఆలయం మళ్లీ తెరుచుకోనుంది. 'చితిర అట్ట విశేషం' సందర్భంగా ఆలయాన్ని 5వ తేదీ సాయంత్రం 5.30 గంటలకు తెరిచి, 6వ తేదీ రాత్రి 10.30 గంటలకు మూసి వేస్తారు. ఆలయంలోకి మహిళలు ప్రవేశించవచ్చంటూ సుప్రీంకోర్టు తీర్పును వెలువరించిన నేపథ్యంలో, ఈ సందర్భంగా మహిళలు ఆలయానికి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీంతో, అక్కడ మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా ఆలయ పరిసర ప్రాంతాల్లో మొత్తం 5000 మంది పోలీసులను మోహరింపజేశారు. పంబ, ఇల్లువంగళ్, నీలక్కళ్ లలో ఈరోజు నుంచే 144 సెక్షన్ ను అమలు చేస్తున్నారు. భక్తులు, మీడియా ప్రతినిధులను తప్ప మరెవరినీ నీలక్కళ్ నుంచి పంబకు అనుమతించబోమని పోలీసు అధికారులు స్పష్టం చేశారు. ఇద్దరు ఐజీలు, ఐదుగురు ఎస్పీలు, 10 మంది డీఎస్పీలు విధులు నిర్వహిస్తున్నారు.

sabarimala
tension
security
women entry
  • Loading...

More Telugu News