Posani Krishna Murali: చంద్రబాబులాంటి మోసగాడు మరొకరు లేరు.. టీఆర్ఎస్ కే నా ఓటు: పోసాని కృష్ణమురళి

  • బతికినంత కాలం చంద్రబాబు నిజం చెప్పరు
  • దేశంలో ఉన్న గొప్ప సీఎంలలో కేసీఆర్ ఒకరు
  • హైదరాబాదులోని ఆంధ్రులు చంద్రబాబును నమ్మరాదు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై సినీ నటుడు పోసాని కృష్ణమురళి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశ చరిత్రలోనే చంద్రబాబులాంటి మోసగాడు మరొకరు లేరని ఆయన విమర్శించారు. బతికి ఉన్నంత కాలం ఆయన నిజం చెప్పరని దుయ్యబట్టారు. నిజం మాట్లాడితే తల వెయ్యి ముక్కలు అవుతుందనే శాపం చంద్రబాబుకు ఉందని ఎద్దేవా చేశారు. జూబ్లీహిల్స్ టీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ ఈరోజు పోసాని నివాసానికి వెళ్లారు. ప్రచారంలో భాగంగా పోసానిని కలసి, ఆయన మద్దతు కోరారు.

ఈ సందర్భంగా పోసాని మాట్లాడుతూ, తాను టీఆర్ఎస్ పార్టీకే ఓటు వేస్తానని చెప్పారు. తక్కువ వ్యవధిలోనే అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిన ఘనత కేసీఆర్ ది అని కితాబిచ్చారు. దేశంలో ఉన్న గొప్ప ముఖ్యమంత్రుల్లో కేసీఆర్ ఒకరని అన్నారు. చంద్రబాబు చెప్పే మాటలను హైదరాబాదులో ఉంటున్న ఆంధ్రులు నమ్మరాదని కోరారు. బాబుకు ఓటు వేస్తే మనం మరో 50 ఏళ్లు వెనక్కి వెళతామని చెప్పారు.

Posani Krishna Murali
Chandrababu
kcr
Maganti Gopinath
  • Loading...

More Telugu News