akhilapriya: జగన్ పై దాడిని ఖండిస్తున్నాం.. ఇలాంటి చర్యలను టీడీపీ ప్రోత్సహించదు!: మంత్రి అఖిలప్రియ

  • దేశ రాజకీయాల్లో చంద్రబాబు కీలకంగా మారారు
  • చంద్రబాబును విమర్శించే నైతిక హక్కు జగన్ కు లేదు
  • ప్రజా సంక్షేమం కోసం ముఖ్యమంత్రి అలసట లేకుండా పని చేస్తున్నారు

దేశ రాజకీయాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు కీలకంగా మారారని మంత్రి అఖిలప్రియ అన్నారు. వామపక్షాలు సైతం ఆయనకు మద్దతు పలుకుతున్నాయని చెప్పారు. అసెంబ్లీ సమావేశాలకు కూడా రాని వైసీపీ నేతలు చంద్రబాబుపై విమర్శలు చేయడం హాస్యాస్పదమని విమర్శించారు. తిత్లీ తుపాను బాధితులను ఇంతవరకు పరామర్శించని వైసీపీ అధినేత జగన్ కు చంద్రబాబును విమర్శించే నైతిక హక్కు కూడా లేదని అన్నారు.

జగన్ పై జరిగిన దాడిని తాము ఖండిస్తున్నామని, ఇలాంటి పిరికి చర్యలకు టీడీపీ ప్రభుత్వం ప్రోత్సహించదని అఖిలప్రియ చెప్పారు. లోటు బడ్జెట్ ఉన్నా ప్రజాసంక్షేమం కోసం ముఖ్యమంత్రి అలసట లేకుండా పని చేస్తున్నారని అన్నారు. కరవుతో ప్రజలు బాధపడుతున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.

akhilapriya
Chandrababu
Telugudesam
ysrcp
jagan
  • Loading...

More Telugu News