Andhra Pradesh: కర్నూలు సైకో టీచర్ వ్యవహారంపై మంత్రి గంటా ఆగ్రహం.. ఉపాధ్యాయుడిపై సస్పెన్షన్ వేటు!

  • ప్రేమించాలని టీచర్ శంకర్ వేధింపులు
  • ఒప్పుకోకపోవడంతో ఈరోజు హత్యకు యత్నం
  • ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న యువతి

తనను ప్రేమించలేదన్న అక్కసుతో కర్నూలు జిల్లాలో ఓ విద్యార్థినిపై టీచర్ శంకర్ కత్తితో దాడిచేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ యువతి ప్రాణాలు దక్కించుకోగా, శంకర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఈ వ్యవహారంపై ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తీవ్రంగా స్పందించారు. బాలికపై దాడికి పాల్పడిన హిందీ పండిట్ శంకర్ ను సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు.

ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు వెల్లడించారు. ఇలాంటి ఘటనలను తమ ప్రభుత్వం ఎంతమాత్రం సహించబోదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో మహిళల భద్రతకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తేల్చిచెప్పారు. కర్నూలు పట్టణంలోని బంగారుపేట కాలనీలో ఉంటున్న బాధితురాలిపై ఈ రోజు ఉదయం శంకర్ కత్తితో దాడిచేసిన సంగతి తెలిసిందే. యువతిపై దాడి అనంతరం తానూ ఆత్మహత్య ప్రయత్నం చేయబోగా శంకర్ ను స్థానికులు చితకబాది పోలీసులకు అప్పగించారు.

Andhra Pradesh
Kurnool District
attack
love
teacher
teenager
girl
student
9th class
Police
Ganta Srinivasa Rao
suicide
suspension
suspend
hindi
pandit
rejected
  • Loading...

More Telugu News