Telangana EC: ఓటర్ల జాబితాలో మీ పేరుందో లేదో సరిచూసుకోండి: ఎన్నికల సంఘం ప్రకటన!

  • 'చెక్ యువర్ ఓట్' పేరుతో ఆదివారం ప్రత్యేక కార్యక్రమం
  • అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో అధికారులు అందుబాటులో ఉంటారని ప్రకటన
  • ఓట్ల తొలగింపు విమర్శల నేపధ్యంలో నిర్ణయం

రాష్ట్రం ఓటర్ల జాబితాలో పేరు ఉన్నదీ లేనిదీ చెక్‌ చేసుకునేందుకు తెలంగాణ ఎన్నికల సంఘం ఆదివారం 'చెక్ యువర్ ఓట్' పేరుతో ప్రత్యేక పరిశీలన కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. విపక్షాలకు ఆధిపత్యం ఉన్న నియోజకవర్గాల్లో పెద్ద సంఖ్యలో ఓట్లు గల్లంతయ్యాయన్న ఆరోపణల నేపథ్యంలో ఎన్నికల సంఘం తాజా ఓటర్ల జాబితా విడుదల చేసిన విషయం తెలిసిందే.

 ‘కొత్త జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్‌ చేసుకోండి. అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో ఎన్నికల అధికారులు ఉంటారు. వారిని సంప్రదించి జాబితా చెక్‌ చేయండి. అభ్యంతరాలు ఉంటే అక్కడికక్కడే  అధికారులకు తెలియజేయండి’ అంటూ ఎన్నికల సంఘం సూచించింది.

Telangana EC
check your vote
special programme
  • Loading...

More Telugu News