Petrol: నేడూ తగ్గిన పెట్రో ధరలు.. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోలు ధర రూ.83.75

  • అంతర్జాతీయంగా తగ్గిన క్రూడాయిల్ ధరలు
  • ఢిల్లీలో లీటరు పెట్రోలుపై 19 పైసలు తగ్గుదల
  • డీజిల్‌పై 11 పైసలు తగ్గింపు

పెట్రో ధరలు శనివారం కూడా తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గడంతో దేశీయంగా ప్రభావం కనిపించింది. ఢిల్లీలో లీటరు పెట్రోలు ధరపై 19 పైసలు తగ్గి రూ.78.99కి చేరుకోగా, డీజిల్ ధర 11 పైసలు తగ్గి రూ.73.53కి చేరుకుంది. ముంబైలో పెట్రోలుపై 19 పైసలు, డీజిల్‌పై 12 తగ్గింది. ఫలితంగా పెట్రోలు ధర రూ.84.49కి, డీజిల్ ధర రూ.77.06కి చేరుకుంది. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే హైదరాబాద్‌లో లీటరు పెట్రోలుపై 21 పైసలు తగ్గి రూ.83.75కి తగ్గగా, డీజిల్‌పై 12 పైసలు తగ్గి రూ.80కి చేరుకుంది. విజయవాడలో పెట్రోలును రూ.82.94కి, డీజిల్‌ను రూ.78.75కి విక్రయిస్తున్నారు.

Petrol
diesel
New Delhi
Mumbai
Hyderabad
Vijayawada
  • Loading...

More Telugu News