Rahul Gandhi: అంబానీ పేరును రాజకీయం చేస్తున్నారు.. రాహుల్ ఆరోపణలపై స్పందించిన రిలయన్స్ డిఫెన్స్

  • అనిల్ అంబానీపై వస్తున్న ఆరోపణలపై స్పందించిన రిలయన్స్ డిఫెన్స్
  • స్వార్థ ప్రయోజనాల కోసమే రాహుల్ ఆరోపణలు
  • వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారన్న రిలయన్స్ డిఫెన్స్

రాఫెల్ డీల్ విషయంలో అనిల్ అంబానీపై కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ చేస్తున్న విమర్శలపై రిలయన్స్ డిఫెన్స్ స్పందించింది. త్వరలోనే అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికలు జరగనుండడంతోనే కావాలనే అనిల్ అంబానీ పేరును వాడుకుంటున్నారని ఆరోపించింది. కాంగ్రెస్ తన స్వార్థ ప్రయోజనాల కోసమే వాస్తవాలను దాచిపెడుతోందని, అనవసర రాద్ధాంతం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. కాంగ్రెస్ తాజాగా మరోమారు తమ చైర్మన్ అనిల్ అంబానీపై అసత్య ఆరోపణలు చేసిందని, ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారని అందులో పేర్కొంది.  

రాఫెల్ ఒప్పందంపై తొలి నుంచి ప్రధాని మోదీపై తీవ్ర ఆరోపణలు చేస్తున్న రాహుల్ గాంధీ తాజాగా మాట్లాడుతూ.. ఈ విషయంలో మోదీ తప్పించుకోలేరని హెచ్చరించారు. రాఫెల్ కుంభకోణంపై దర్యాప్తు ప్రారంభమైతే మోదీ తప్పించుకోలేరని, అందుకు తనది గ్యారెంటీ అని అన్నారు. అనిల్ అంబానీ కోసమే ఆయనీ ఒప్పందం కుదుర్చుకున్నారని రాహుల్ ఆరోపించారు.

Rahul Gandhi
Reliance defence
Rafale
Anil Ambani
  • Loading...

More Telugu News