Chandrababu: కేఈ కృష్ణమూర్తి ఇంకా బతికే ఉన్నారు: సోము వీర్రాజు సెటైర్

  • అయ్యన్న పాత్రుడు కూడా ఇంకా టీడీపీలోనే ఉన్నారు
  • చంద్రబాబును టీడీపీ నుంచి బహిష్కరించాలి
  • ఆయను వర్ణించేందుకు భాషా గ్రంథాలు సరిపోవు

కాంగ్రెస్‌తో టీడీపీ కనుక చేతులు కలిపితే ఆత్మహత్య చేసుకుంటానన్న ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ఇంకా బతికే ఉన్నారని బీజేపీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌తో పొత్తు కుదరదన్న అయ్యన్న పాత్రుడు ఇంకా టీడీపీలోనే ఉన్నారని అన్నారు. టీడీపీ నుంచి చంద్రబాబును బహిష్కరించాల్సిన సమయం వచ్చిందన్న ఆయన.. చంద్రబాబు రాజకీయ వ్యభిచారి అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయనను వర్ణించేందుకు నాగరిక భాషా గ్రంథాలు కూడా సరిపోవన్నారు.

వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయన్న విలేకరుల ప్రశ్నకు వీర్రాజు అసహనం వ్యక్తం చేశారు. నాలుగు సీట్లు కూడా లేని తమను నిలదీయడం మాని చంద్రబాబునే ఆ ప్రశ్న అడగాలని సూచించారు. అలాగే, వైసీపీ, జనసేన పార్టీలను బీజేపీయే నడిపిస్తోందన్న ఆరోపణలపై స్పందించాల్సిందిగా కోరినప్పుడు సమాధానాన్ని దాటవేశారు.

Chandrababu
KE Krishnamurthy
Andhra Pradesh
Somu veerraju
BJP
  • Loading...

More Telugu News