varla ramaiah: ఈ కలయికతో మోదీ-అమిత్ షా వణికిపోతున్నారు: వర్ల రామయ్య

  • చంద్రబాబు నిర్ణయంతో ఎన్టీఆర్ ఆత్మ హర్షిస్తుంది
  • మోదీ పరిపాలనలో ఓ హిట్లర్ కనిపిస్తున్నాడు
  • జీవీఎల్, సోము వీర్రాజు వ్యాఖ్యలు హాస్యాస్పదం

రాహుల్- చంద్రబాబు భేటీతో మోదీ-అమిత్ షా వణికిపోతున్నారని ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య విమర్శించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, తెలుగువారి ఆత్మగౌరవాన్ని కించపరిస్తే తిరగబడాలని నేర్పింది ఎన్టీఆరేనని అన్నారు. మోదీ పరిపాలనలో ఓ హిట్లర్ కనిపిస్తున్నాడని మండిపడ్డారు. చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయంతో ఎన్టీఆర్ ఆత్మ హర్షిస్తుందని, ఈ నిర్ణయాన్ని అన్నిపార్టీలు సమర్థిస్తున్నాయని చెప్పారు. రాజకీయ అనివార్యత కారణంగానే కాంగ్రెస్ పార్టీతో టీడీపీ చేతులు కలపాల్సి వచ్చిందని స్పష్టం చేశారు.

కాంగ్రెస్-టీడీపీ కలయికను జీర్ణించుకోలేని కొందరు బీజేపీ నేతలు నందమూరి కుటుంబసభ్యులకు ఫోన్ చేసి రెచ్చగొడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు కుటుంబంపై ఎన్టీఆర్ కుటుంబం తిరగబడాలని బీజేపీ నేతలు జీవీఎల్ నరసింహారావు, సోము వీర్రాజు వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదమని, టీడీపీలో విభేదాలు సృష్టించే ఆలోచనలను మానుకోవాలని వర్ల రామయ్య హితవు పలికారు.

varla ramaiah
modi-amithsha
rahul-babu
  • Loading...

More Telugu News