Chandrababu: రాష్ట్ర ప్రతిపక్ష నేతలుగా జగన్, పవన్ అవసరమా?: కాల్వ శ్రీనివాసులు

  • అన్యాయాలపై జగన్, పవన్ నోరు మెదపట్లేదు
  • కోడికత్తిపై మాత్రం జాతీయ స్థాయిలో రచ్చ
  • మోదీ, అమిత్‌షాలకు బుద్ధి చెప్పేందుకే రాహుల్‌తో భేటీ 

రాష్ట్ర ప్రతిపక్ష నేతలుగా జగన్, పవన్ అవసరమా? అని మంత్రి కాల్వ శ్రీనివాసులు ప్రశ్నించారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్న ప్రధాని మోదీ, అమిత్‌షాలకు బుద్ధి చెప్పేందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు.. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిశారని పేర్కొన్నారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాలపై జగన్ కానీ.. పవన్ కానీ నోరు మెదపట్లేదన్నారు. కోడికత్తిపై మాత్రం జగన్ జాతీయ స్థాయిలో రచ్చ చేస్తున్నారని కాల్వ విమర్శించారు. టీడీపీ సిద్ధాంతాలకు కట్టుబడే జాతీయ స్థాయిలో విపక్ష పార్టీలన్నింటినీ కలుపుకుపోతోందని కాల్వ పేర్కొన్నారు.

Chandrababu
Rahul Gandhi
Jagan
Pawan Kalyan
Kalva Srinivasulu
Narendra Modi
  • Loading...

More Telugu News