cpi: సీట్ల పంపకంపై ‘కాంగ్రెస్’ గందరగోళం సృష్టిస్తోంది: చాడ వెంకటరెడ్డి

  • కాంగ్రెస్ పార్టీ అసంబద్ధమైన లీకులు ఇస్తోంది
  • ఈ పార్టీ తీరుపై అసంతృప్తిగా ఉన్నాం
  • ఎల్లుండి తాడోపేడో తేల్చుకుంటాం

కాంగ్రెస్ పార్టీ తీరుపై సీపీఐ మండిపడుతోంది. ‘మహాకూటమి’ ఏర్పడి ఇన్ని రోజులైనా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని తెలంగాణ రాష్ట్ర సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విమర్శించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, సీట్ల పంపకంపై కావాలని చెప్పే ‘కాంగ్రెస్’ గందరగోళానికి గురిచేస్తోందని, ఇకపై సర్దుబాటు ధోరణి పనికిరాదనిపిస్తోందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అసంబద్ధమైన లీకులు ఇస్తోందని, ఈ పార్టీ తీరుపై తాము అసంతృప్తిగా ఉన్నామని, ఎల్లుండి తాడోపేడో తేల్చుకుంటామని స్పష్టం చేశారు. ఈ నెల 4న రాష్ట్ర కార్యవర్గ అత్యవసర సమావేశం ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.

cpi
chada venkat reddy
mahakutami
  • Loading...

More Telugu News