sai dharam tej: మెగా హీరోకి మరో హీరోయిన్ దొరికేసింది!

  • తేజు హీరోగా 'చిత్రలహరి'
  • ఒక కథానాయికగా కల్యాణి ప్రియదర్శన్
  • మరో హీరోయిన్ గా నివేదా పేతు రాజ్    

కెరియర్ ఆరంభంలో సాయిధరమ్ తేజ్ వరుస విజయాలను సొంతం చేసుకుంటూ, మాస్ హీరోగా మంచి పేరు తెచ్చుకున్నాడు. అయితే, ఇటీవలి కాలంలో ఆయనను పరాజయాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దాంతో తన తదుపరి సినిమా విషయంలో ఆయన చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఆయన తాజా చిత్రంగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో 'చిత్రలహరి' రూపొందనుంది.

ఈ సినిమాలో కథానాయికల పేర్లు చిత్ర - లహరి. ఈ కారణంగానే ఈ సినిమాకి ఈ టైటిల్ పెట్టారు. చిత్ర పాత్రకి గాను ఆల్రెడీ కల్యాణి ప్రియదర్శన్ ను ఎంపిక చేశారు. ఇక లహరి పాత్రకి గాను నివేదా పేతు రాజ్ ను తీసుకున్నారనేది తాజా సమాచారం. 'మెంటల్ మదిలో' సినిమా ద్వారా ఈ అమ్మాయి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. మైత్రీ మూవీస్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టుకి సంబంధించిన మిగతా వివరాలు త్వరలో తెలుస్తాయి. 

sai dharam tej
kalyani
niveda
  • Loading...

More Telugu News