dmk: తమిళనాడులో స్టాలిన్ ప్రభంజనం: రిపబ్లిక్ టీవీ - సీఓటర్ సర్వే

  • అన్నాడీఎంకేకు 9, ఎన్డీయేకు ఒకటి
  • గత నెలతో పోల్చితే 10.5 శాతం పెరిగిన డీఎంకే ఓట్ షేర్
  • జాతీయ రాజకీయాలలో కీలకపాత్ర పోషించనున్న డీఎంకే

లోక్ సభ ఎన్నికల్లో తమిళనాడులో స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే పార్టీ ప్రభంజనం సృష్టించబోతోందని రిపబ్లిక్ టీవీ-సీఓటర్ సర్వే తేల్చి చెప్పింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 39 పార్లమెంటు స్థానాలకు గాను డీఎంకే 29 స్థానాల్లో జయకేతనం ఎగురవేస్తుందని తెలిపింది.అన్నాడీఎంకేకు 9, ఎన్డీయేకు ఒక్క స్థానం దక్కుతాయని వెల్లడించింది.

రాష్ట్రంలో 43.6 శాతం మంది ఓటర్లు డీఎంకేకు మద్దతుగా ఉన్నారని చెప్పింది. గత నెలతో పోల్చితే డీఎంకే ఓట్ షేర్ 10.5 శాతం పెరిగిందని తెలిపింది. 29 ఎంపీలతో జాతీయ రాజకీయాల్లో డీఎంకే కీలకపాత్ర పోషిస్తుందని పేర్కొంది.

dmk
Tamilnadu
stalin
republic tv
cvoter
survey
aiadmk
nda
  • Loading...

More Telugu News