bjp: టికెట్ల లొల్లి.. నిజామాబాద్ బీజేపీ కార్యాలయం ధ్వంసం

  • నిజామాబాద్ అర్బన్ అభ్యర్థిగా యెండల లక్ష్మీనారాయణను ఖరారు చేసిన బీజేపీ
  • పార్టీ కార్యాలయంపై దాడి చేసిన ధన్ పాల్ వర్గీయులు
  • పార్టీకి రాజీనామా చేసే యోచనలో ధన్ పాల్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ ప్రకటించిన రెండో జాబితా... ఆ పార్టీలో చిచ్చు రాజేసింది. టికెట్లు రాని ఆశావహులు పార్టీ హైకమాండ్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండో జాబితాలో నిజామాబాద్ అర్బన్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ పేరును ప్రకటించడంతో... పార్టీలోని అసమ్మతి బయటపడింది.

తమకు టికెట్ ఇవ్వకపోవడంపై ధన్ పాల్ వర్గం మండిపడింది. జిల్లా బీజేపీ కార్యాలయంపై దాడి చేసి, ఫర్నిచర్ ను ధ్వంసం చేసింది. మరోవైపు పార్టీకి ధన్ పాల్ రాజీనామా చేయనున్నట్టు సమాచారం. ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. పార్టీ నాయకత్వం లక్ష్మీనారాయణకు అమ్ముడుపోయిందని ధన్ పాల్ వర్గం ఆరోపిస్తోంది. 

bjp
nizamabad
urban
yendal lakshminarayana
dhanpal
  • Loading...

More Telugu News