Sunny Leone: సన్నీలియోన్‌ 'వీరమదేవి' చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హైకోర్ట్!

  • సన్నీలియోన్‌ ప్రధాన పాత్రలో 'వీరమదేవి'
  • సినిమా చిత్రీకరణను నిలిపివేయాలని పిటిషన్
  • పిటిషన్‌ను కొట్టివేసిన కోర్టు

బాలీవుడ్‌ నటి సన్నీలియోన్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న 'వీరమదేవి' సినిమాకు ఊరట లభించింది. ఈ చిత్రంపై దాఖలైన పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టుకు చెందిన మధురై బెంచ్ కొట్టివేసింది. ఈ సినిమాలో వీరమదేవి పాత్రలో సన్నీలియోన్‌ నటిస్తోంది.

శృంగార తారగా ముద్ర పడ్డ సన్నీలియోన్‌ ఉన్నతమైన వీరమదేవి పాత్రలో నటించడం అంటే వీరమదేవిని అవమానించడమేనని, వెంటనే సినిమా చిత్రీకరణను నిలిపివేయాలని మధురైలోని సెల్లూరుకు చెందిన సరవణన్‌ అనే న్యాయవాది మధురై బెంచ్ లో ప్రజాహిత వ్యాజ్యం కింద పిటిషన్ దాఖలు చేశారు. దీనిని విచారించిన కోర్టు ఒక నటిని పలానా పాత్రలో నటించవద్దని చెప్పడం సరికాదని, పాత్రకు సరిపోతారనుకుంటే ఏ పాత్రనైనా చేయవచ్చని, కాబట్టి విచారణకు స్వీకరించలేమని పేర్కొంది. దీంతో ఈ చిత్రానికి ఆటంకాలు తొలగిపోయాయి.

Sunny Leone
Bollywood
  • Loading...

More Telugu News