school teacher murder: ప్రియురాలి మోజులో భార్య హత్య...మూడు రౌండ్లు కాల్పులు జరపడంతో మృతి

  • కొడుకు, కూతురు ఉండగా మరో మహిళతో వివాహేతర సంబంధం
  • విషయం తెలిసి మందలించిన భార్య
  • దీంతో ఆమెను వదిలించుకోవాలని నిర్ణయం

ప్రియురాలి మోజులో పడిన అతనికి కట్టుకున్న భార్య భారం అయింది. ఆమెతో కలిసి హత్యకు పథకం పన్నాడు. పాఠశాలకు వెళ్తుండగా ఆమెపై మూడు రౌండ్లు కాల్పులు జరపడంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. దేశరాజధాని ఢిల్లీలోని భావన ప్రాంతంలో సోమవారం ఉదయం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.

పోలీసుల కథనం మేరకు... ఓ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్న సునీత (38), మంజిత్‌ (38) దంపతులు. వీరికి 16 ఏళ్ల కుమార్తె, 8 ఏళ్ల కుమారుడు ఉన్నారు. యాంగిల్‌ గుప్తా అలియాస్‌ శశి ప్రభ (26)తో కొన్నాళ్లుగా మంజిత్ వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ విషయం తెలిసి సునీత భర్తను మందలించింది. దీంతో తన వివాహేతర సంబంధానికి భార్య అడ్డు అవుతోందని భావించిన మంజిత్‌, ప్రియురాలితో కలిసి ఆమె హత్యకు పథక రచన చేశాడు. అక్టోబరు 29వ తేదీ ఉదయం సునీత పాఠశాలకు వెళ్తుండగా ఆమెపై మూడు రౌండ్లు కాల్పులు జరిపాడు. దీంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలి మృతిచెందింది. మృతురాలి బంధువు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

school teacher murder
husbend fired
illegal affair effect
  • Loading...

More Telugu News