jalagam prasadarao: జలగం ప్రసాదరావుపై నిషేధం ఎత్తివేసిన కాంగ్రెస్

  • క్రమశిక్షణను ఉల్లంఘించారనే కారణాలతో ఆరేళ్లపాటు జలగంపై నిషేధం
  • నిషేధం ఎత్తివేసిన టీపీసీసీ
  • ఏకే ఆంటోనీకి సమాచారాన్ని అందించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి

కాంగ్రెస్ సీనియర్ నేత జలగం ప్రసాదరావుపై విధించిన సస్పెన్షన్ ను కాంగ్రెస్ పార్టీ ఎత్తివేసింది. నిషేధాన్ని ఎత్తివేసినట్టు ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ ఏకే ఆంటోనీకి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సమాచారాన్ని అందించారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించారనే కారణాలతో జలగం ప్రసాదరావును ఆరేళ్ల పాటు పార్టీ నుంచి బహిష్కరించారు. తాజాగా, ఆయనపై సస్పెన్షన్ ను ఎత్తివేయడంతో... పార్టీలో ఆయన క్రియాశీలకంగా మారనున్నారు. జలగంపై నిషేధం ఎత్తివేతతో... ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.

jalagam prasadarao
suspension
congress
Uttam Kumar Reddy
ak antony
  • Loading...

More Telugu News