Jagan: మానని గాయం, పైకి లేవని చెయ్యి... జగన్‌ పాదయాత్ర మరో వారం వాయిదా!

  • పాదయాత్ర నిర్ణయాన్ని వాయిదా వేసుకున్న జగన్
  • ఈ ఉదయం జగన్ ను పరీక్షించిన వైద్యులు
  • కుట్లు ఇంకా మానకపోవడంతో తరువాత తొలగిస్తామని వెల్లడి
  • మరో వారం పాటు విశ్రాంతి తీసుకోనున్న జగన్

జగన్ ఎడమ భుజానికి తగిలిన కోడి కత్తి గాయం ఇంకా మానలేదు. దీంతో నేడు విశాఖకు వెళ్లి, రేపటి నుంచి ప్రజాసంకల్ప పాదయాత్రను తిరిగి ప్రారంభించాలన్న జగన్, తన నిర్ణయాన్ని వాయిదా వేసుకోక తప్పలేదు. ఈ ఉదయం జగన్ ను పరీక్షించిన వైద్యులు, గాయం మానలేదని, యాత్ర చేసే సమయంలో ఇబ్బందులు వస్తాయని హెచ్చరించడంతో మరో వారం పాటు జగన్, తన యాత్రను వాయిదా వేసుకున్నట్టు తెలుస్తోంది.

కుట్లు ఇంకా మానకపోవడంతో, వాటిని తొలగించని డాక్టర్లు, భుజం లోపల కండరాలకు తగిలిన గాయం మానలేదని స్పష్టం చేశారు. జగన్, తన ఎడమ చెయ్యిని పైకి ఎత్తే పరిస్థితి లేకపోవడంతో, మరో వారం విశ్రాంతి అనంతరం, ఈ నెల 10వ తేదీ నుంచి తన పాదయాత్రను తిరిగి ప్రారంభించనున్నారని వైకాపా వర్గాలు వెల్లడించాయి. ఈ విషయంలో అధికారిక ప్రకటన వెలువడాల్సివుంది.

Jagan
Padayatra
Doctors
  • Loading...

More Telugu News