Chittoor District: శ్రీకాళహస్తీశ్వరాలయం ప్రధానాచార్యులు శివైక్యం... గుడి మూసివేయాలని అధికారుల నిర్ణయం!

  • సదాశివం గురుకుల్ కన్నుమూత
  • ఆయన వయసు 85 సంవత్సరాలు
  • మరికాసేపట్లో ఆలయం మూత

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలోని పవిత్ర శ్రీకాళహస్తీశ్వర దేవాలయం స్థానాచార్యులు సదాశివం గురుకుల్ ఈ ఉదయం కన్నుమూశారు. ఆయన వయసు 85 సంవత్సరాలు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచారని కుటుంబసభ్యులు తెలిపారు. చిన్నతనం నుంచే శివధ్యానంలో గడిపిన ఆయన, కాళహస్తీశ్వరునికి కొన్ని వేల అభిషేకాలను స్వయంగా నిర్వహించారు. ఆయన మృతికి సంతాపం తెలిపిన అధికారులు, ఆలయాన్ని నేడు మూసివేయాలని అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఆయన అంత్యక్రియల తరువాత ఆలయాన్ని తిరిగి తెరుస్తామని అన్నారు.

Chittoor District
Sri Kalahasti
Sadasivam gurukul
Died
  • Loading...

More Telugu News