sp balasubramaniam: ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి అరుదైన గౌరవం
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-1ad45b71653c62c9dc67738dde1190155c857d4b.jpg)
- బాలు ఫొటోతో పోస్టల్ కవర్ విడుదల
- తన జీవితం ధన్యమైందన్న బాలు
- చిన్ననాటి గుర్తులను నెమరువేసుకున్న దిగ్గజ గాయకుడు
ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి అరుదైన గౌరవం లభించింది. ఆయన ఫొటోతో కూడిన పోస్టల్ కవర్‌ను నెల్లూరు జిల్లా పోస్టల్ శాఖ గురువారం ఆవిష్కరించింది. కలెక్టరేట్‌లో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బాలు.. తొలి కవర్‌ను చీఫ్ పోస్టు మాస్టర్ జనరల్ కె.బాలసుబ్రహ్మణియన్‌కు అందించారు.
ఈ సందర్భంగా ఎస్పీ బాలు మాట్లాడుతూ.. సంగీతానికి భాషలేదని, అదే ఒక భాషని పేర్కొన్నారు. అలాంటి భాషతో ముడివేసుకున్న తనను పోస్టల్ శాఖ గుర్తించి సత్కరించడంతో తన జీవితం ధన్యమైందన్నారు. సొంత ఊరిలో తనకు దక్కిన గౌరవాన్ని ఎన్నటికీ మర్చిపోలేనని పేర్కొన్న ఆయన.. తన చిన్ననాటి గుర్తులను నెమరువేసుకున్నారు. ఈ సందర్భంగా తెలుగు, తమిళ సినిమాల్లోని పాటలను పాడి వినిపించారు.