Kamal Hassan: '2.ఓ’ను వదులుకున్న కమల్.. కారణాన్ని వెల్లడించిన శంకర్!

  • ప్రతినాయకుడి పాత్ర కోసం కమల్‌ను కలిశాం
  • రజనీ, కమల్‌ను ఒకే తెరపై చూడాలనుకున్నాం
  • కమల్ ‘భారతీయుడు-2’ పట్ల ఆసక్తి చూపారు

దేశంలోనే భారీ బడ్జెట్‌తో రూపొందిన '2.ఓ' చిత్రంలో కమలహాసన్ నటించాల్సి ఉందట. కానీ కమల్ మాత్రం భారతీయుడు-2కే ఎక్కువ మొగ్గు చూపడంతో చేసేదేమీలేక ఆ సినిమా దర్శకుడు శంకర్ ఇక ఆ పాత్రకి అక్షయ్ కుమార్‌ని ఎంచుకున్నారట. '2.ఓ'లో రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటించగా.. అక్షయ్ ప్రతినాయకుడి పాత్రలో నటించారు. తాజాగా శంకర్ ఓ ఇంటర్వ్యూలో ప్రతినాయకుడి పాత్రకు సంబంధించిన ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు.

ప్రతినాయకుడి పాత్ర కోసం తొలుత హాలీవుడ్ ప్రముఖ నటుడు ఆర్నాల్డ్ ష్వార్జ్‌నెగ్గర్‌ను అనుకున్నామని, వివిధ కారణాలతో ఆయన తప్పుకున్నారని తెలిపారు. అనంతరం కమల్‌ను సంప్రదించామని.. ఆయన నటిస్తే రజనీని, కమల్‌నూ ఒకే తెరపై చూడాలన్న కల నెరవేరుతుందని అనుకున్నామని శంకర్ తెలిపారు. దీనికోసం తాను, చిత్ర మాటల రచయిత జయమోహన్ కలిసి కమల్‌ను కలిశామని, కానీ ఆయన తనతో భారతీయుడు-2 సినిమా చేసేందుకే ఎక్కువ ఆసక్తి చూపడంతో చేసేదేమీలేక అక్షయ్‌ను ఎంచుకున్నామని శంకర్ తెలిపారు.

Kamal Hassan
Rajinikanth
2.0
Shankar
Akshay Kumar
  • Loading...

More Telugu News