Congress-Telugudesam: జాతీయ దృక్పథంలో భాగంగానే తెలంగాణలో కాంగ్రెస్-టీడీపీ పొత్తు: సీఎం చంద్రబాబు

  • తెలంగాణలో సీట్ల విషయంపై రాహుల్ తో చర్చించా
  • టీఆర్ఎస్ కు స్నేహ హస్తమందిస్తే అవసరం లేదంది
  • హైదరాబాద్ ను అభివృద్ధి చేసినందుకా విమర్శలు?

జాతీయ దృక్పథంలో భాగంగానే తెలంగాణలో కాంగ్రెస్-టీడీపీ పొత్తు కుదుర్చుకున్నామని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. ఢిల్లీలో ఈరోజు రాత్రి ఆయన మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణలో సీట్ల విషయంపై రాహుల్ గాంధీతో చర్చించామని చెప్పారు. టీఆర్ఎస్ కు స్నేహ హస్తం అందిస్తే, తమకు అవసరం లేదని తిరస్కరించిందని విమర్శించారు.

కేసీఆర్ చెప్పిన తృతీయ కూటమి ఏర్పాటు గురించి చంద్రబాబును విలేకరులు ప్రశ్నించగా, దీని గురించి ఆయన్నే అడగాలని అన్నారు. హైదరాబాద్ ను అభివృద్ధి చేయడమే తాను చేసిన తప్పా? అని ప్రశ్నించారు. ‘హైదరాబాద్ ను అభివృద్ధి చేసినందుకేనా టీఆర్ఎన్ నాపై విమర్శలు చేస్తోంది? నన్ను బూచిగా చూపి రాజకీయ లబ్ధి పొందేందుకు టీఆర్ఎస్ యత్నిస్తోంది' అంటూ మండిపడ్డారు. తెలంగాణలో తమ పార్టీ గెలిచినా, తానేమీ ముఖ్యమంత్రిని కాను కదా?’ అని అన్నారు.

  • Loading...

More Telugu News