Revanth Reddy: హైకోర్టు ఆదేశాల మేరకు రేవంత్ రెడ్డికి భద్రత పెంపు!

  • రేవంత్‌కి భద్రత పెంచాలని నిర్ణయం
  • భద్రతకు అయ్యే ఖర్చు రేవంతే భరించాలి
  • 4+4 గన్‌మెన్లన్లు, ఎస్కార్ట్‌లతో భద్రత

హైకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ పోలీస్ శాఖ తాజా మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి భద్రత పెంచాలని నిర్ణయించింది. అయితే ఆయన భద్రతకు అయ్యే ఖర్చును రేవంతే భరించాలని హైకోర్టు ఆదేశాలను జారీ చేసింది. రేవంత్ భద్రతకు స్టేట్ ఫోర్స్‌నే వినియోగించాలని డీజీపీని ఆదేశించింది. తనకు ముప్పుందని.. కేంద్ర బలగాలు లేదంటే స్వతంత్ర సంస్థతో తనకు రక్షణ కల్పించాలని రేవంత్ హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఈ మేరకు తీర్పు ఇచ్చింది. హైకోర్టు ఆదేశాల మేరకు పోలీస్ శాఖ రేవంత్ భద్రత నిమిత్తం 4+4 గన్‌మెన్లను, ఎస్కార్ట్‌లను పంపించింది.

Revanth Reddy
High Court
DGP
Protection
Escorts
Police
  • Loading...

More Telugu News