bjp: బీజేపీని ఎండగట్టడానికే ప్రాంతీయ పార్టీలు ఏకమయ్యాయి: నిమ్మల కిష్టప్ప

  • మోదీ పాలనలో దేశం మొత్తం ఇబ్బంది పడుతోంది
  • అన్ని పక్షాలను ఏకం చేయాల్సిన సమయం వచ్చింది
  • జీవీఎల్ లాంటి వ్యక్తులకు భవిష్యత్ అర్థం కాదు  

సమాజ్ వాది పార్టీ నేత అఖిలేష్ యాదవ్ పిలిచినందుకే కాదు, జాతీయ స్థాయిలో అన్ని పక్షాలను ఏకం చేయాల్సిన సమయం వచ్చింది కనుకనే సీఎం చంద్రబాబునాయుడు ఢిల్లీ వచ్చారని టీడీపీ ఎంపీ నిమ్మల కిష్టప్ప అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రధాని మోదీ పాలనలో ఏపీ ఒక్కటే కాదు, యావత్తు దేశం ఇబ్బంది పడుతోందని విమర్శించారు.

బీజేపీని ఎండగట్టడానికే ప్రాంతీయ పార్టీలు ఏకమయ్యాయని అన్నారు. ఈ సందర్భంగా బీజేపీ ఎంపీ జీవీఎల్ పై ఆయన విమర్శలు చేశారు. జీవీఎల్ లాంటి వ్యక్తులకు  భవిష్యత్ అర్థం కాదని విమర్శించారు. టీడీపీకి చెందిన మరో ఎంపీ మాగంటి బాబు మాట్లాడుతూ, ఎండగట్టడానికే ప్రాంతీయ పార్టీలు ఏకమయ్యాయని, టీడీపీని విమర్శించే అర్హత బీజేపీకి లేదని అన్నారు.

bjp
Telugudesam
nimmala kishtappa
  • Loading...

More Telugu News