Raveena Tandon: షూటింగ్ చూసేందుకు వెళ్తే రణ్‌వీర్‌ను గెంటేశారట.. కారణం చెప్పిన రవీనా!

  • ‘కాఫీ విత్ కరణ్’లో పంచుకున్న రణ్‌వీర్
  • రణ్‌వీర్ చిన్నవాడని చెప్పిన రవీనా
  • చెడు ప్రభావం చూపిస్తుందనే పంపించినట్టు వెల్లడి

‘కాఫీ విత్ కరణ్’ కార్యక్రమంలో ఓ ఆసక్తికర విషయాన్ని బాలీవుడ్ ప్రముఖ నటుడు రణ్‌వీర్ సింగ్ పంచుకున్నారు. గతంలో ఓసారి షూటింగ్ చూడటానికి వెళ్తే రణ్‌వీర్‌ను అక్కడి నుంచి గెంటేశారట. ఎందుకు గెంటేశారనే విషయమైతే చెప్పలేదు కానీ అక్షయ్ కుమార్, రవీనా టాండన్ కలసి నటించిన సినిమా చిత్రీకరణ చూసేందుకు వెళ్లానని మాత్రం రణ్‌వీర్ వెల్లడించారు. ఈ విషయమై మీడియా రవీనా టాండన్‌ను ప్రశ్నించగా ఆమె సమాధానం చెప్పారు.

అప్పుడు రణ్‌వీర్ చిన్నవాడే కాకుండా అల్లరి వాడని ఆమె తెలిపారు. అక్షయ్, తాను పాల్గొనగా అప్పుడు ఓ వానపాటను చిత్రీకరిస్తున్నారని.. దానిలో రొమాంటిక్ సీన్స్ ఎక్కువగా ఉన్నాయని రవీనా తెలిపారు. పిల్లలు అలాంటివి చూస్తే వారిపై చెడు ప్రభావం చూపించే అవకాశముందనే కారణంగా సెట్‌లో నిర్మాతకు చెప్పి రణ్‌వీర్‌ని బయటకు పంపించినట్టు రవీనా వెల్లడించారు. రణ్‌వీర్‌పై తనకు ఎలాంటి కోపమూ లేదని ఆమె తెలిపారు.

Raveena Tandon
Ranveer singh
Akshay Kumar
Movie Shooting
Coffee With Karan
  • Loading...

More Telugu News