Asaduddin Owaisi: సెక్యులరిజం గురించి చంద్రబాబు మాట్లాడడం సిగ్గుచేటు: అసదుద్దీన్ ఓవైసీ

  • చంద్రబాబు హయాంలో ముస్లింలపై దాడులు
  • గుజరాత్ అల్లర్లప్పుడు ఏన్డీఏలో భాగస్వామి
  • ట్విట్టర్ వేదికగా చంద్రబాబుపై ఓవైసీ ఫైర్

కాంగ్రెస్ పార్టీతో జట్టుకట్టేందుకు ప్రయత్నిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై ఎంఐఎం నేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ముస్లింలపై దాడులు, హత్యలకు కారణమైన చంద్రబాబు ఇప్పుడు సెక్యూలరిజం గురించి మాట్లాడటం సిగ్గుచేటని విమర్శించారు.

అక్లాక్, ఫహ్లుఖాన్, రోహిత్, జునైద్, అలీముద్దీన్‌ల హత్యలతోపాటు అజీజ్, అజామ్‌ల ఎన్‌కౌంటర్లు కూడా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జరిగాయని ధ్వజమెత్తారు. 2002 గుజరాత్ అల్లర్లు జరిగినప్పుడు కూడా అప్పటి ఎన్డీఏ సర్కార్‌తో చంద్రబాబు భాగస్వామిగా ఉన్నారని మండిపడ్డారు. ట్విట్టర్ వేదికగా ఈ ఘాటైన విమర్శలు చేశారు.

Asaduddin Owaisi
AIMIM
Chandrababu
Telugudesam
  • Loading...

More Telugu News