ashok gajapathi raju: ఏపీ రాజకీయాల్లో వినోదం పెరిగింది.. ప్రస్తుతం కోడికత్తి కథ నడుస్తోంది!: అశోక్ గజపతిరాజు

  • రాష్ట్ర రాజకీయాల్లో విలువలు నశించిపోయాయి
  • తనను తాను నమ్మే స్థితిలో కూడా జగన్ లేరు
  • ఫెడరల్ భావాలున్న పార్టీలతో కలసి ముందుకు వెళతాం

ఏపీ రాజకీయాల్లో విలువలు నశించిపోయాయని, వినోదం పెరిగిందని కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ నేత అశోక్ గజపతిరాజు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం కోడికత్తి కథ నడుస్తోందని అన్నారు. వైసీపీ అధినేత జగన్ పై దాడి కేసు... ఇప్పుడు వినోదాత్మకంగా మారిందని చెప్పారు.

చట్టాలపై నమ్మకం లేదని చెబుతున్న జగన్... ప్రజలకు ఎలాంటి సంకేతాలు ఇవ్వాలనుకుంటున్నారని ప్రశ్నించారు. తనను తాను నమ్మే స్థితిలో కూడా జగన్ లేరని ఎద్దేవా చేశారు. జాతీయ రాజకీయాల్లో ఫెడరల్ భావాలున్న పార్టీలతో కలసి వెళతామని చెప్పారు. 

ashok gajapathi raju
jagan
stab
Telugudesam
  • Loading...

More Telugu News