kollywood: లెస్బియన్ సంబంధం కోసం నన్ను బలవంత పెట్టింది.. సహనటిపై అనన్య రామ్ షాకింగ్ కామెంట్స్!

  • రిలేషన్ షిప్ కోసం మాయ వేధించింది
  • అనన్య ప్రకటనలో కోలీవుడ్ లో ప్రకంపనలు
  • ‘మీటూ లో’ భాగంగా బయటపెట్టిన నటి

పని ప్రదేశంలో లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా మొదలైన ‘మీ టూ’ ఉద్యమం దేశంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ఉద్యమం దెబ్బకు బాలీవుడ్ నటులు నానాపటేకర్, అలోక్ నాథ్ ల జాతకాలు మారిపోగా, దర్శకులు సాజిద్ ఖాన్, సుభాష్ ఘయ్ లు కీలక ప్రాజెక్టుల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. తాజాగా కోలీవుడ్ లో ‘మీ టూ’ ఉద్యమం మరో మలుపు తీసుకుంది. లెస్బియన్ గా మారాలంటూ తనను సహనటి మాయ ఎస్.కృష్ణన్‌ వేధించిందని అనన్య రామ్ ప్రసాద్ షాకింగ్ కామెంట్లు చేసింది.

లెస్బియన్ రిలేషన్ షిప్ కోసం తనను మాయ బలవంతపెట్టిందని ఆరోపించింది. అనన్య ఆరోపణలతో కోలీవుడ్ లో కలకలం చెలరేగింది. తొడరి, మగళిర్ మట్టుమ్, వేట్టైక్కారన్ వంటి సినిమాల్లో మాయ నటించింది. తాజాగా రజనీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రోబో '2.ఓ' సినిమాలోనూ ఓ పాత్ర పోషించింది. తమిళ గేయ రచయిత వైరముత్తు తనను లైంగికంగా వేధించాడని గాయని చిన్మయి శ్రీపాద ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.

kollywood
me too
lesbian
relationship
Tamilnadu
ananya ram prasad
maya s krishnan
sexual harrasment
  • Loading...

More Telugu News