akkineni sudarshan rao: అక్కినేని సుదర్శనరావు మృతిపై చంద్రబాబు సంతాపం

  • తానా ఫౌండేషన్ చైర్మన్‌గా చేసిన సుదర్శనరావు
  • అమెరికాలో తెలుగు వారి శ్రేయస్సు కోసం పాటుపడ్డారు
  • ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా

తానా ఫౌండేషన్ చైర్మన్‌గా పని చేసిన డాక్టర్ అక్కినేని సుదర్శనరావు మృతిపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు. అమెరికాలో తెలుగు వారి శ్రేయస్సు కోసం పని చేసిన వ్య‌క్తి సుదర్శనరావు అని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు తన ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేస్తున్నట్టు చంద్రబాబు తెలిపారు. కాగా, తానా ఫౌండేషన్ ద్వారా రాష్ట్రంలో గ్రామాల అభివృద్ధికి తోడ్పాటును అందించారు. తానా వ్యవస్థాపకుల్లో ఆయన కూడా ఒకరు.  

  • Error fetching data: Network response was not ok

More Telugu News