raana: రానా హీరోగా 'విరాటపర్వం 1992'.. హీరోయిన్ గా సాయిపల్లవి!

- రానాతో వేణు ఉడుగుల
- కొత్తదనంతో కూడిన కథాకథనాలు
- త్వరలోనే సెట్స్ పైకి
'నీది నాది ఒకే కథ' సినిమాతో దర్శకుడిగా వేణు ఉడుగుల మంచి మార్కులు కొట్టేశాడు. ఆ తరువాత నుంచి ఆయన ఒక కథపై కసరత్తు చేస్తూ పూర్తి రూపాన్ని తీసుకొచ్చాడు. ఈ కథకి ఆయన 'విరాటపర్వం 1992' అనే టైటిల్ ను ఖరారు చేసుకున్నాడు. ఈ సినిమాను నానితో గానీ .. నితిన్ తో గాని .. శర్వానంద్ తో గాని రూపొందించాలని ఆయన ప్రయత్నించాడు.
